

ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకేజీ ఘటనలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, వైద్య మరియు ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర విద్యాశాఖ కీలక మార్పులు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. బోర్డు పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇవ్వాలని ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈ మార్పుల ద్వారా పారదర్శకత పెంచడం, కోచింగ్ సెంటర్లపై ఆధారపడటాన్ని తగ్గించడం, సిలబస్‌కు అనుగుణంగా పరీక్షలను మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ నేపథ్యంలో గతేడాది ఏర్పాటు చేసిన తొమ్మిది మంది సభ్యుల కమిటీ ప్రస్తుతం నివేదిక సిద్ధం చేస్తోంది. త్వరలో కేంద్రానికి తుది నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం నీట్ మరియు జేఈఈ వంటి పరీక్షల ఆధారంగా అడ్మిషన్లు జరుగుతున్నాయి. అయితే, పేపర్ లీకేజీలు, మూల్యాంకన లోపాలు, కోచింగ్ ఒత్తిడి వంటి సమస్యల కారణంగా కేంద్రం ఈ మార్పులను తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!