
రాజకీయాలు

హైదరాబాద్లో జరిగిన కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె హాజరు కాకపోవడం వెనుక కారణాలపై అధికారులు, రాజకీయ వర్గాలు విస్తృతంగా చర్చిస్తున్నాయి.
యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు విషయంలో అసంతృప్తి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే ఆమె గైర్హాజరుకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా, మంత్రి ఇటీవలే విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చినప్పటికీ, అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం ఆసక్తిని మరింత పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!