
రాజకీయాలు

శివకాశి జిల్లాలో గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోపై నాయకన్‌పట్టి సమీపంలోని గురులక్ష్మి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒక మహిళా కార్మికురాలికి సుమారు 90 శాతం వరకు కాలిన గాయాలు కావడం ఆందోళన కలిగిస్తోంది.
పేలుడు తర్వాత 20 మందికి పైగా కార్మికులు మంటల్లో చిక్కుకుపోయినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!