
జనరల్

విశాఖపట్నం వేదికగా ఈ నెల 22, 23 తేదీల్లో బ్రిక్స్ దేశాలకు సంబంధించిన కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు బ్రిక్స్‌లోని 11 దేశాలకు చెందిన మంత్రులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని సమావేశాల్లో భాగస్వామ్యం కానున్నారు. అంతర్జాతీయ సహకారం, యువతకు సంబంధించిన అంశాలపై ఈ భేటీల్లో చర్చించే అవకాశం ఉంది.
ఈ నెల 22న యువజన మంత్రుల సమావేశం నిర్వహించనుండగా.. 23న విశాఖ బీచ్ రోడ్డులో ‘ఫ్రెండ్‌షిప్ సైకిల్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. బ్రిక్స్ దేశాల మధ్య స్నేహ సంబంధాలు, పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విశాఖలో జరగనున్న ఈ సమావేశాలు రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురానున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!