
గాసిప్స్

క్యాబ్ రైడ్‌ను బుక్ చేసుకునే ముందే వినియోగదారులకు టిప్ చెల్లించే ఆప్షన్‌ను చూపించే విధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం క్యాబ్ అగ్రిగేటర్లను ఆదేశించింది. ఈ విధానం వినియోగదారులను తప్పుదోవ పట్టించడంతోపాటు అన్యాయమైన వాణిజ్య పద్ధతిగా మారే అవకాశం ఉందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే తెలిపారు.
రైడ్ పూర్తైన తర్వాత మాత్రమే వినియోగదారుడి నిర్ణయం మేరకు టిప్పింగ్ ఉండాలని ఆమె స్పష్టం చేశారు. ముందుగానే టిప్ చెల్లించేలా వినియోగదారులపై ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని పేర్కొన్నారు. అన్యాయ వాణిజ్య పద్ధతులకు పాల్పడినందుకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) ర్యాపిడోపై రూ.10 లక్షల జరిమానా విధించిన మరుసటి రోజే నిధి ఖరే ఈ వ్యాఖ్యలు చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!