

టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ స్టాక్ మార్కెట్‌లో షేర్ల లిస్టింగ్‌ను తప్పించుకునేందుకు పలు ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, కంపెనీని రెండు భాగాలుగా విభజించడం, రుణాలను తిరిగి చెల్లించడం, కీలకేతర ఆస్తులను విక్రయించడం ద్వారా బ్యాలెన్స్ షీట్ పరిమాణాన్ని తగ్గించడం వంటి అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. గురువారం జరగనున్న టాటా సన్స్ బోర్డు సమావేశంలో ఈ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
టాటా సన్స్‌లో టాటా ట్రస్టులకు సుమారు 66 శాతం వాటా ఉంది. టాటా ట్రస్టుల చైర్మన్ నోయల్ టాటా కంపెనీ లిస్టింగ్‌కు సుముఖంగా లేరని, లిస్టింగ్ జరిగితే ట్రస్టుల దాతృత్వ కార్యక్రమాలకు కొన్ని అవాంతరాలు ఏర్పడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే ట్రస్టుల సభ్యుల మధ్య ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు టాటా సన్స్‌లో సుమారు 18 శాతం వాటా కలిగిన షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ లిస్టింగ్‌కు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం. స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ ద్వారా తమ వాటాకు తగిన విలువ లభిస్తుందని ఆ గ్రూప్ భావిస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!