

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు.. భారతదేశానికి సరైన సమయంలో సరైన నాయకుడిగా మోదీ ఉన్నారని పేర్కొన్నారు. మోదీ విజన్‌తో వికసిత్ భారత్ @ 2047 లక్ష్యం దిశగా దేశం వేగంగా పయనిస్తోందని అన్నారు. సుదీర్ఘ ప్రజా సేవలో భాగమైన మోదీతో కలిసి పనిచేయడం గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.
కేంద్రంలో, ఏపీలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాల వల్ల అభివృద్ధి, పెట్టుబడులకు సరికొత్త వేగం లభించిందని చంద్రబాబు తెలిపారు. ప్రధాని సహకారంతో మౌలిక సదుపాయాలు, అవకాశాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోందని చెప్పారు. మోదీ నాయకత్వంలో దృఢమైన భారత్‌తో పాటు సుసంపన్నమైన స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ మరిన్ని విజయాలు సాధించి దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!