

చెన్నైని ప్రపంచ స్థాయి ఒలింపిక్ నగరంగా, ప్రధాన మోటార్‌స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తమిళనాడు సీఎం విజయ్ అసెంబ్లీలో ప్రకటించారు. కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్‌ను 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నట్లు తెలిపారు. అలాగే చెన్నైని మోటార్‌స్పోర్ట్స్ సిటీగా అభివృద్ధి చేసి, భవిష్యత్‌లో ఫార్ములా 1-4 రేసులకు ఆతిథ్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ప్రతిపాదిత ఒలింపిక్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో క్రీడా మైదానాలు, ఆధునిక క్రీడా పరికరాలు, శిక్షణ కేంద్రాలు, స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్ సెంటర్లు, అథ్లెట్లకు అత్యున్నత వసతి, కోచ్‌ల నియామకం వంటి సదుపాయాలు కల్పించనున్నారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారులకు అత్యాధునిక శిక్షణ, ప్రపంచ స్థాయి వసతులు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని సీఎంవో పేర్కొంది. మరోవైపు భారత్‌లో 2028 చివరి నాటికి ఫార్ములా 1 రేసింగ్‌ను తిరిగి నిర్వహించాలనే లక్ష్యంతో యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!