

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని అధికారులు విచారిస్తున్నారు. ఎర్ర గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, దస్తగిరి మధ్య జరిగినట్లు ఆరోపణలున్న రూ.40 కోట్ల డీల్‌పై ఈడీ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నట్లు సమాచారం. వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో దస్తగిరి తన బ్యాంకు స్టేట్‌మెంట్లతో విచారణకు హాజరయ్యారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
గతంలో సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తనకు రూ.5 కోట్లు ఇస్తామని చెప్పినట్లు దస్తగిరి వెల్లడించారు. ప్రస్తుతం అదే వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. హత్య కేసుతో ముడిపడి ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల మధ్య ఆర్థిక సంబంధాలు, నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను అధికారులు పరిశీలిస్తున్నారు. కేసులో ఆర్థిక కోణాన్ని వెలుగులోకి తీసుకురావడంలో భాగంగానే దస్తగిరి విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!