
జనరల్

తెలంగాణ ప్రభుత్వం ‘చేయూత’ నూతన పెన్షన్ల దరఖాస్తు గడువును మరో రోజు పొడిగించింది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అర్హులు సెప్టెంబర్ 16 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించుకునే వెసులుబాటు కల్పించింది. వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో దరఖాస్తుదారులకు ఇబ్బందులు ఎదురైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15తో ముగియాల్సి ఉంది.
గడువును మరో రోజు పొడిగిస్తూ ఎస్‌ఈఆర్‌పీ సీఈవో దివ్య దేవరాజన్ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు చేయూత నూతన పెన్షన్ల కోసం 5.78 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు ఈ అదనపు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!