
జనరల్

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర అందరిలో స్ఫూర్తి నింపిందని ప్రముఖ నటుడు చిరంజీవి ప్రశంసించారు. ఈ సందర్భంగా తన కెరీర్ ప్రారంభ రోజులను గుర్తుచేసుకుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అప్పట్లో కొందరు తనకు మద్యం సేవించాలని సూచించారని, అయితే తాను ఆ అలవాటుకు దూరంగా ఉంటూ తన లక్ష్యంపైనే దృష్టి సారించానని తెలిపారు.
యువత మద్యం, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని చిరంజీవి సూచించారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు కష్టపడాలని పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులు, సమాజం గర్వించేలా యువత తమ తమ రంగాల్లో అత్యున్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!