
జనరల్

ఆర్థిక ఇబ్బందులతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. సీతానగరం మండలం జగ్గునాయుడుపేట సమీపంలో గూడ్స్ రైలు కింద పడి బొబ్బిలి పట్టణానికి చెందిన చల్లపల్లి శ్రీను (60), ఆయన భార్య సింహాచలం (53), కుమారుడు రాజేశ్ (25) ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక సమస్యలే ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
రాజేశ్ చినగంట్యాడలోని లక్కీడాం సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, ఘటనకు సంబంధించిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!