

జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల పోర్టల్‌లో భద్రతా లోపం కారణంగా దాదాపు రెండు లక్షల మంది విద్యార్థుల వ్యక్తిగత సమాచారం బయటకు రావడంపై రాజకీయ వివాదం చెలరేగింది. విద్యార్థుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఫొటోలు లీక్ కావడంపై కాక్రోచ్ జనతా పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ విద్యా వ్యవస్థ, డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే తొలగించాలని ప్రధానికి డిమాండ్ చేసింది.
పార్టీ అధికార ప్రతినిధి అశుతోష్ రంకా ఈ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ టీనేజీ సైబర్ భద్రతా పరిశోధకుడు ఈ లోపాన్ని గుర్తించి సమాచారం అందించాడని తెలిపారు. ఇదే సమయంలో పరీక్షల రద్దు, పేపర్ లీకుల నేపథ్యంలో విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థిని నీట్ పరీక్ష వివాదాలతో మనస్తాపానికి గురై నాగపూర్‌లో ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ న్యాయం జరగాలని కోరారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!