
బిజినెస్

సాయి కృష్ణ లాకప్ మృతికేసులో మరో కీలక న్యాయ పరిణామం చోటుచేసుకుంది. విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో దాఖలైన ప్రైవేట్ పిటిషన్లో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు, సౌత్ జోన్ ఏసీపీ ఎం. మానసలను ఈ కేసులో నిందితులుగా చేర్చాలని కోరారు. పోలీసు ఉన్నతాధికారుల బాధ్యతపై విచారణ జరగాలని పిటిషన్లో పేర్కొన్నారు.
తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి తరఫున ఈ పిటిషన్ దాఖలుకాగా, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టులో వాదనలు వినిపించనున్నారు. డీజీపీని ఏ-1గా, పోలీస్ కమిషనర్‌ను ఏ-2గా, ఏసీపీ మానసను ఏ-3గా చేర్చాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్‌పై కోర్టు తీసుకునే నిర్ణయం కేసు దర్యాప్తు తదుపరి దశను ప్రభావితం చేసే అవకాశముంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!