
బిజినెస్

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన పార్లమెంట్ భవనంలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ మంగళ్-మిలాన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర కూటమి నేతలు హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పలు కీలక బిల్లుల ఆమోదానికి సంబంధించిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం.
సమావేశంలో ప్రధాని మోడీ నీట్ పరీక్ష వ్యవహారంపై కూడా స్పందించారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా పరీక్ష నిర్వహించామని ఆయన తెలిపారు. ప్రశ్నపత్రం లీక్ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నామని పేర్కొంటూ, భవిష్యత్లో పరీక్షా పత్రాల లీకేజీని పూర్తిగా అరికట్టేందుకు మరింత బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!