

గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇప్పుడు నగరానికి విస్తరించింది. హైదరాబాద్ పరిధిలోని 26 నియోజకవర్గాల్లో అర్హులైన పేదలకు ఇళ్లు కేటాయించనున్నారు. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 500 చొప్పున ఇళ్లు ఇవ్వనుండగా, ఇప్పటికే 16 సెగ్మెంట్లలో 7,680 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం లక్ష ఇళ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం.
దరఖాస్తులు మీ సేవ కేంద్రాలు, వెబ్సైట్ లేదా వాట్సాప్ నంబర్ 80969 58096 ద్వారా ఆగస్ట్ 10లోపు చేసుకోవాలి. రూ.100 దరఖాస్తు ఫీజు, రూ.10,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించాలి. అర్హతలలో 10 ఏళ్లుగా జీహెచ్ఎంసీ పరిధిలో నివాసం, సొంత ఇల్లు లేకపోవడం, వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉండటం వంటి షరతులు ఉన్నాయి. ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ ఇస్తుండగా, లబ్దిదారుడు రూ.6 లక్షలు విడతల వారీగా చెల్లించాలి. కేటాయించిన ఇళ్లను విక్రయించడం అనుమతించబడదు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!