
జనరల్

ఢిల్లీకి వస్తున్న పలు రైళ్లను రద్దు చేయడంపై సీజేపీ స్పందించింది. జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు పోలీసుల అనుమతి అవసరం లేదని పేర్కొంది. నిరసనలు, ఆందోళనలు చేపట్టేందుకే జంతర్ మంతర్ ప్రాంతాన్ని కేటాయించారని సీజేపీ వ్యాఖ్యానించింది. ఢిల్లీకి చేరుకునే రైళ్ల రద్దుపై ఆందోళన వ్యక్తం చేస్తూ, నిరసన తెలిపే హక్కును అడ్డుకోవద్దని అభిప్రాయపడింది.
యువత నిరసనలకు వస్తారనే భయంతో ఆంక్షలు విధిస్తే, దేశం మొత్తాన్నే మూసివేయాలని సీజేపీ ఘాటుగా వ్యాఖ్యానించింది. యువత గొంతును అణచివేసే చర్యలు సరికావని పేర్కొంది. ఢిల్లీలో నిరసనలకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో సీజేపీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!