

శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో రైలు ఢీకొని నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖరావు, దిలీప్, శివ, శరత్ అనే నలుగురు విద్యార్థులు మృతి చెందడం విషాదకరమని పేర్కొంటూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనపై అధికారులను అడిగి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సీఎం తెలుసుకున్నారు. రైలు రాకను గమనించలేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఘటనలో సాల్మన్‌రాజ్ అనే మరో విద్యార్థి గాయపడినట్లు తెలిపారు.
గాయపడిన సాల్మన్‌రాజ్‌కు ప్రస్తుతం టెక్కలి డీహెచ్‌లో చికిత్స అందిస్తున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. అతనికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, బాధితులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!