

బిహార్‌లో వివాదాస్పద వ్యాఖ్యలతో జేడీయూ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే అనంత్‌సింగ్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓ హత్య కేసులో డిసెంబర్ మొదటి వారంలో దర్యాప్తు అధికారుల ఎదుట లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించిన నేపథ్యంలో ఆయన వార్తల్లో నిలిచారు. ఇదిలా ఉండగా, తన కుమార్తె శివాంగి సింగ్ వివాహాన్ని ఘనంగా నిర్వహించేందుకు అనంత్‌సింగ్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 25న జరగనున్న ఈ వివాహానికి సుమారు నాలుగు లక్షల మందికి విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
వివాహ వేడుకల్లో భాగంగా గుర్రపు స్వారీ, కుస్తీ పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పోటీల్లో విజేతలకు మహీంద్రా థార్ జీపు, బైక్‌ను బహుమతులుగా అందించనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పోటీదారులు ఇప్పటికే బిహార్‌కు చేరుకుంటున్నట్లు సమాచారం. వీటితో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారు. రాజకీయ, న్యాయపరమైన పరిణామాల మధ్య అనంత్‌సింగ్ కుమార్తె వివాహ ఏర్పాట్లు స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!