

అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది రంపంతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపిక ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. బాలిక ప్రశాంతంగా నిద్రపోతూ, క్రమంగా ఆహారం తీసుకుంటోందని వెల్లడించారు. ఫిజియోథెరపీతో పాటు శరీర కదలికలకు సంబంధించిన వ్యాయామాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
శస్త్రచికిత్స, ఇన్ఫెక్షన్ నియంత్రణ విభాగాలతో పాటు ఇతర వైద్య బృందాలు గోపికకు అవసరమైన చికిత్స అందిస్తున్నాయని లోకేశ్ వివరించారు. వైద్యుల షెడ్యూల్ ప్రకారం ఆపరేషన్ థియేటర్‌లో డ్రెస్సింగ్ పూర్తయ్యాక ఆమెను వార్డుకు తరలించనున్నట్లు తెలిపారు. బాలిక కోలుకుంటున్న తీరును నిరంతరం పరిశీలిస్తూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న వైద్య బృందానికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వివరాలను ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!