

నిరుపేదలు, బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందినప్పుడే ప్రగతికి నిజమైన అర్థం ఉంటుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఎర్రుపాలెం, మధిర, బోనకల్ మండలాల్లో నిర్వహించిన ‘మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల కుటుంబ సభ్యులతో కలిసి బాణసంచా కాల్చి పండుగ సంబరాలు చేసుకున్నారు. పేదలతో కలిసి దీపావళి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
పేదల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి నిరుపేద కుటుంబానికి సొంత గూడు కల్పించాలనే సంకల్పంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. సమాజంలోని బలహీన వర్గాలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందినప్పుడే రాష్ట్రం నిజమైన ప్రగతిని సాధించినట్లవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి వేడుకలు నిర్వహించడం ద్వారా వారి కుటుంబాల్లో పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!