
జనరల్

ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)ను అధికారికంగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎఫ్‌సీడీఏ లోగో, వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్‌ను గతంలో కులీకుతుబ్ షా, నిజాం పాలకులు విస్తరించారని, ఆ తరువాత హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధికి అడ్డంకులు ఎదురయ్యాయని ఆయన పేర్కొన్నారు.
ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అలాగే హైదరాబాద్‌లో ఇటీవల వర్షాల కారణంగా వచ్చిన వరద పరిస్థితులను ప్రస్తావిస్తూ, గత అభివృద్ధి, మౌలిక సదుపాయాల లోపాలపై బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!