
రాజకీయాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం సాయంత్రం సిద్దిపేటలో ప్రారంభించారు. పేద కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.
ఈ నెల 19 నుంచి డిసెంబర్ 18 వరకు నెల రోజుల పాటు లబ్ధిదారుల నమోదు ప్రక్రియ కొనసాగనుంది. గ్రామ పంచాయతీ, వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక శిబిరాలతో పాటు ఆన్‌లైన్ లేదా ఇంటింటి సర్వే ద్వారా వివరాలను నమోదు చేస్తారు. ఈ పథకం కింద లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. బీమాకు సంబంధించిన పూర్తి ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!