6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపటి నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

Writer: Chandrika 10:28 PM, 6 నవంబర్, 2026
రేపటి నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నవంబర్‌ 7 నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు కొడంగల్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నవంబర్‌ 7న ఉదయం 11 గంటలకు వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలోని యంగ్‌ ఇండియా ఎడ్యుకేషన్‌ హబ్‌ ఆవరణలో మెగా రైతు మేళా, ఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోను ప్రారంభించనున్నారు. అనంతరం స్టాళ్లను సందర్శించి, మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఒంటి గంట నుంచి 2 గంటల వరకు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. ఎడ్యుకేషన్‌ హబ్‌ పనులను పరిశీలించిన అనంతరం కొడంగల్‌లోని తన నివాసానికి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. నవంబర్‌ 8న ఉదయం స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమై పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో రూ.81 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఎకోపామ్‌ పామాయిల్‌ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నారు. హకీంపేట, బొంరాస్‌పేట, కొడంగల్‌, దుద్యాల, కోస్గి, దౌల్తాబాద్‌ ప్రాంతాల్లో పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పోలీస్‌ స్టేషన్లు, సర్కిల్‌ కార్యాలయం, సమీకృత మండల కార్యాలయం, సైన్స్‌ మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. కోస్గి మండలం నాచారం గ్రామంలో రూ.5,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న రేడియల్‌ రోడ్‌–2కు శంకుస్థాపన చేస్తారు. నవంబర్‌ 8న కూడా కొడంగల్‌లోనే బస చేయనున్న సీఎం.. నవంబర్‌ 9న సాయంత్రం 5 గంటలకు హకీంపేటలో నిర్వహించే భారీ రైతు బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ మూడు రోజుల పర్యటనలో మొత్తం సుమారు రూ.9,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు భారీ భద్రత..

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు భారీ భద్రత..

సివిల్స్ అభ్యర్థులకు పంజాబ్ సర్కార్ గుడ్‌న్యూస్..

సివిల్స్ అభ్యర్థులకు పంజాబ్ సర్కార్ గుడ్‌న్యూస్..

తుఫాన్ బాధిత రైతులకు అండగా ఉంటాం - చంద్రబాబు భరోసా

తుఫాన్ బాధిత రైతులకు అండగా ఉంటాం - చంద్రబాబు భరోసా

ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు

ప్రపంచ పెట్టుబడులకు తెలంగాణను గ్లోబల్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్‌బాబు

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

భార్యాభర్తల వివాదంలోకి చాట్‌జీపీటీ.. అసలేం జరిగింది?

భార్యాభర్తల వివాదంలోకి చాట్‌జీపీటీ.. అసలేం జరిగింది?

ట్యాగ్లు
రేవంత్‌రెడ్డికొడంగల్‌ పర్యటనతెలంగాణ సీఎంవికారాబాద్‌ జిల్లారైతు మేళాఇండస్ట్రియల్‌ ఎక్స్‌పోరేడియల్‌ రోడ్‌–2తెలంగాణ అభివృద్ధిఎకోపామ్‌ ఫ్యాక్టరీహకీంపేట
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజీవ్‌ గాంధీతో పెళ్లి తర్వాత తొలిసారి తందూరీ చికెన్‌ రుచి చూశా: సోనియా గాంధీ
జనరల్

రాజీవ్‌ గాంధీతో పెళ్లి తర్వాత తొలిసారి తందూరీ చికెన్‌ రుచి చూశా: సోనియా గాంధీ

రేపటి నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..
జనరల్

రేపటి నుంచి మూడు రోజుల పాటు కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన..

సీఎం రేవంత్‌రెడ్డికి నిశ్చితార్థ ఆహ్వానం అందించిన తేజ సజ్జా..
సినిమాలు

సీఎం రేవంత్‌రెడ్డికి నిశ్చితార్థ ఆహ్వానం అందించిన తేజ సజ్జా..

‘ఆదిపురుష్‌’ను దాటేసిన ‘రామాయణం’..
సినిమాలు

‘ఆదిపురుష్‌’ను దాటేసిన ‘రామాయణం’..

కమల్‌హాసన్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ విడుదల...
సినిమాలు

కమల్‌హాసన్ కొత్త సినిమా ఫస్ట్‌లుక్ విడుదల...

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు భారీ భద్రత..
జనరల్

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు భారీ భద్రత..

భారతీయ సినిమా గర్వపడే చిత్రం ‘రామాయణం’-డైరెక్టర్ శంకర్
సినిమాలు

భారతీయ సినిమా గర్వపడే చిత్రం ‘రామాయణం’-డైరెక్టర్ శంకర్

క్రైమ్ కామెడీగా సూర్య 'సీన్'.. ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది?
రివ్యూలు

క్రైమ్ కామెడీగా సూర్య 'సీన్'.. ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించింది?

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్..
బిజినెస్

జియో యూజర్లకు అదిరిపోయే ఆఫర్..

కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన విజయసాయిరెడ్డి..
రాజకీయాలు

కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన విజయసాయిరెడ్డి..

సివిల్స్ అభ్యర్థులకు పంజాబ్ సర్కార్ గుడ్‌న్యూస్..
జనరల్

సివిల్స్ అభ్యర్థులకు పంజాబ్ సర్కార్ గుడ్‌న్యూస్..

సైబర్‌ భద్రతకు OpenAI కొత్త AI మోడల్‌..
టెక్నాలజీ

సైబర్‌ భద్రతకు OpenAI కొత్త AI మోడల్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!