
జనరల్

తెలంగాణకు చెందిన షట్లర్ గాయత్రి గోపీచంద్, షూటర్ ధనుష్ శ్రీకాంత్ ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపిక కావడంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. క్రీడారంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ గౌరవాన్ని దక్కించుకున్న గాయత్రి గోపీచంద్, ధనుష్ శ్రీకాంత్ తెలంగాణతో పాటు దేశానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. వారి కృషి, ప్రతిభ రాష్ట్ర క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
జాతీయ క్రీడా పురస్కారాలు–2025 అందుకున్న విజేతలందరికీ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడారంగంలో వారు ప్రదర్శించిన అంకితభావం, పట్టుదల, కృషి యువ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి, దేశానికి మరింత పేరు తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!