
జనరల్

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసన కార్యక్రమంలో కొందరు దుండగులు దాడి చేసినట్లు సమాచారం. నిరసనలో పాల్గొన్న అభిమానులు ఆయనను భుజాలపై మోస్తూ తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జనం మధ్య నుంచి వచ్చిన కొందరు వ్యక్తులు అభిజిత్ దీప్కేకు చెంపదెబ్బలు కొట్టినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చర్చనీయాంశంగా నిలిచాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!