
షోస్

కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలోని కొత్తూరు బైపాస్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది.
అయితే, ఈ ప్రమాదం నుంచి బల్మూరి వెంకట్, ఆయన భార్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ, దంపతులకు ప్రాణాపాయం తప్పడంతో ఊరట లభించింది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!