

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వైరా సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద ఆగి ఉన్న లారీని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందగా.. వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన కోటా కిశోర్‌రెడ్డి తన భార్య లావణ్య, కుమారుడు ప్రణీత్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా వైరా సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవే ఎగ్జిట్ వద్ద వీరి కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కిశోర్‌రెడ్డి, లావణ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ప్రణీత్‌ను స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!