

2029 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆందోళన వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి అయితే దేశంలో ఎన్నికల నిర్వహణ కేవలం నామమాత్రంగానే మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్ష పార్టీల ఉనికి పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు.
ఎన్నికల కమిషన్ పూర్తిగా అధికార పార్టీ నియంత్రణలోకి వెళ్లే పరిస్థితులు ఏర్పడవచ్చని, ప్రతిపక్షాలను బలహీనపరచడమే బీజేపీ లక్ష్యమని గెహ్లాట్ విమర్శించారు. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియలో చేసిన మార్పులను ఇందుకు ఉదాహరణలుగా ప్రస్తావించారు. రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం రాజకీయ మార్పునకు ఆరంభమని పేర్కొన్నారు. ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!