

2026 ఆసియా గేమ్స్ మహిళల క్రికెట్‌లో టీమ్‌ఇండియా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్‌లో జపాన్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జపాన్‌ను భారత బౌలర్లు 19.5 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ చేశారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీచరణి 4/10తో అద్భుత ప్రదర్శన చేయగా.. షఫాలీ వర్మ రెండు వికెట్లు పడగొట్టారు. దీప్తి శర్మ, శ్రేయాంకా పాటిల్ చెరో వికెట్ తీశారు.
58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ కేవలం 5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. షఫాలీ వర్మ 15 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 40 పరుగులు చేయగా.. రిచా ఘోష్ 12 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. కమలిని, భారతి ఫుల్మాలి వికెట్లు కోల్పోయినా భారత్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. సెప్టెంబర్ 20న జరిగే సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్‌తో తలపడనుంది. మరో సెమీఫైనల్లో శ్రీలంక-పాకిస్థాన్ తలపడనున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!