
జనరల్

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో నేటి రాత్రి 9 గంటల నుంచి టూవీలర్ల రాకపోకలను నిలిపివేయనున్నారు. ద్విచక్ర వాహనాలతో వచ్చే భక్తుల కోసం తిరుపతిలో ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేశారు. బాలాజీ లింకు బస్టాండ్, నెహ్రూ హైస్కూల్ గ్రౌండ్, ఎస్వీ వైద్య కళాశాల, ఇస్కాన్ ఆలయ మైదానాల్లో బైక్‌లను పార్కింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.
కార్లు, టూరిస్ట్ వాహనాల కోసం కూడా తిరుపతిలో ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించారు. టూవీలర్లపై ఆంక్షలు ఉన్నప్పటికీ భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సులు నిరంతరాయంగా నడపనున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలను వినియోగించి ప్రజా రవాణా సదుపాయాలను ఉపయోగించుకోవాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!