

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల పట్ల గౌరవం, మర్యాద, ఆప్యాయతతో సేవలు అందించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శ్రీవారి సేవకులను కోరారు. బుధవారం తిరుమల ఆస్థాన మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన శ్రీవారి సేవకులతో ఆయన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసి, సేవకుల సంఖ్యను రెట్టింపు చేసేందుకు చర్యలు చేపడతామని చైర్మన్ తెలిపారు.
5,000 ఆలయాల నిర్మాణానికి సంకల్పించామని, వాటికి శ్రీవారి సేవకులు మూలస్తంభాలుగా నిలవాలని ఈవో ముద్దాడ రవిచంద్ర కోరారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర, దేశ స్థాయిలో ప్రణాళికాబద్ధంగా హిందూ ధర్మ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. శ్రీవారి సేవకులకు శిక్షణ అందించి సేవలను మరింత బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారని అదనపు ఈవో వెంకయ్య చౌదరి చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో సేవకులు అంకితభావం, క్రమశిక్షణ, సమన్వయంతో విధులు నిర్వహించి భక్తులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!