
రాజకీయాలు

మాజీ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) అంత్యక్రియలను రేపు ఏలూరులో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖపట్నంలోని తన నివాసంలో గుండెపోటుతో ఆళ్ల నాని మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని ఏలూరుకు తరలించారు. పలువురు రాజకీయ నేతలు ఇప్పటికే ఆయనకు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
ఆళ్ల నాని ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2024 ఎన్నికల తర్వాత వైసీపీని వీడి 2025లో టీడీపీలో చేరారు. రేపటి అంత్యక్రియలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!