
రాజకీయాలు

యెమెన్‌కు చెందిన హౌతీ గ్రూప్ మక్కా, మదీనా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇస్లామిక్ దేశాల సమాఖ్య తీవ్రంగా స్పందించింది. పవిత్ర స్థలాలు, మసీదుల పవిత్రతను ఉల్లంఘించే చర్యలను సహించబోమని స్పష్టం చేసింది. ఇలాంటి దాడులు పౌరుల్లో భయాందోళనలు సృష్టించడంతోపాటు పవిత్ర స్థలాల భద్రతకు ముప్పు కలిగిస్తాయని పేర్కొంది.
పవిత్ర స్థలాలు, మసీదులు, పౌర మౌలిక వసతులపై దాడులను ఉగ్రవాద చర్యలుగా ఇస్లామిక్ దేశాల సమాఖ్య అభివర్ణించింది. సౌదీ అరేబియా భద్రత, సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తీసుకునే చర్యలకు పూర్తి సంఘీభావం, మద్దతు ప్రకటించింది. కాగా, మక్కా వైపు వచ్చిన మానవరహిత వైమానిక వాహనాన్ని సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ అడ్డుకున్నట్లు సౌదీ అధికారులు తెలిపారు. అయితే హౌతీలు పవిత్ర స్థలాలను లక్ష్యంగా చేసుకున్నారన్న ఆరోపణను గతంలో ఖండించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!