
జనరల్

గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు సైబర్ నేరాలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా భైంసా అదనపు ఎస్పీ సాయి కిరణ్ సూచించారు. బుధవారం కుంటాల మండలంలోని పెంచి కల్ పాడ్ గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన పత్రాలు లేని 70 రెండు చక్రాల వాహనాలు, 3 ప్రయాణికుల ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. చట్టాలపై కూడా వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు అశోక్, సుప్రియ, కృష్ణ రెడ్డి తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!