
రాజకీయాలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు దేశంలోని సరిహద్దు జిల్లాల ఎస్పీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత బలోపేతం చేసే అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
అదేవిధంగా సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పులపై ప్రత్యేక నిఘా, డ్రోన్ల ద్వారా జరుగుతున్న అక్రమ కార్యకలాపాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ నియంత్రణ, కేంద్ర-రాష్ట్ర భద్రతా సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరచే అంశాలపై అధికారులు సమగ్రంగా చర్చించనున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!