

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ భారీ షాక్ ఇచ్చింది. నిధుల దుర్వినియోగం, అక్రమ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన మూడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసింది. ఈ ఖాతాల్లో మొత్తం రూ.440.42 కోట్ల సొమ్ము ఉన్నట్లు వెల్లడైంది. కోల్‌కతా పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా ‘కేర్‌వెల్ ఏవియేషన్’ అనే ప్రైవేట్ జెట్, హెలికాప్టర్ అద్దె సంస్థతో టీఎంసీ జరిపిన లావాదేవీలను పరిశీలించారు. పార్టీ నిధుల నుంచి సుమారు రూ.160 కోట్లు ఈ సంస్థకు బదిలీ అయినట్లు గుర్తించారు. ఈ నిధులతో విమానాలు కొనుగోలు చేసి, తిరిగి టీఎంసీకే అద్దెకు ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు. అంతర్గత విభేదాలు, ఎమ్మెల్యేల ఫిర్యాదుల నేపథ్యంలో ఇప్పటికే ఖాతాలపై పరిమితులు విధించగా, ఇప్పుడు మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద పూర్తిగా ఫ్రీజ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!