

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, నీట్ మరియు నెట్ పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలపై మోదీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. పదేపదే కుంభకోణాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. లక్షలాది మంది విద్యార్థులు కష్టపడి చదివినా వారి శ్రమకు విలువ ఇవ్వడం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నుంచి జవాబుదారీతనం ఆశించడం వ్యర్థమని అన్నారు.
యూజీసీ-నెట్ 2026 పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రం లీక్ అయ్యిందన్న ఆరోపణలను ప్రస్తావిస్తూ, పరీక్షకు ముందు 100 పేజీల పీడీఎఫ్ బయటకు వచ్చిందని, అందులోని ప్రశ్నలు అసలు పేపర్‌తో సరిపోలుతున్నాయని పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో ఈ ప్రశ్నపత్రాలు రూ.2.25 లక్షలకు అమ్ముతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఎన్‌టీఏ స్పందించకపోవడంపై ప్రశ్నించిన రాహుల్, విద్యార్థులకు న్యాయం జరగదని ఆందోళన వ్యక్తం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!