
రాజకీయాలు

సాయి కృష్ణ లాకప్ మరణం కేసులో సీఐ నాగరాజు కస్టడీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో కస్టడీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో 2వ ఏజేఎంఎఫ్‌సీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించి కస్టడీకి అనుమతి ఇచ్చింది.
అయితే, విచారణను తప్పనిసరిగా ఆడియో–వీడియో రికార్డింగ్ మధ్య, అలాగే రాజమండ్రి సెంట్రల్ జైలులోనే నిర్వహించాలని హైకోర్టు విధించిన షరతులపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధనలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో తుది నిర్ణయం సుప్రీంకోర్టు విచారణ అనంతరం వెలువడే అవకాశం ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!