
జనరల్

రష్యా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ మాస్కోలోని స్బేర్‌సిటీని సందర్శించారు. స్బేర్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ ఎఫిమోవ్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా క్వాంటం టెక్నాలజీ, ఏఐ ఆధారిత సేవలు, డిజిటల్ హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలపై స్బేర్‌సిటీ ప్రతినిధులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
అలాగే స్బేర్ ఆధ్వర్యంలో నడుస్తున్న వినూత్న విద్యా సంస్థ ‘స్కూల్ 21’ను కూడా ఆయన సందర్శించారు. అక్కడ అమలవుతున్న భిన్నమైన విద్యా విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. స్బేర్‌సిటీ భవిష్యత్ టెక్నాలజీకి వారధిగా నిలుస్తుందని మంత్రి లోకేశ్ అభిప్రాయపడ్డారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!