

జన నాయకుడు చిత్రం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సినీ ప్రయాణానికి ఓ ట్రిబ్యూట్‌లా నిలుస్తుందని నిర్మాత వెంకట్ కె. నారాయణ తెలిపారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు కీలక పాత్రలు పోషించారు. మొదట జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా, కోర్టు వ్యవహారాలు, పైరసీ సమస్యలు, థియేటర్లకు సంబంధించిన సవాళ్ల కారణంగా జూలై 23కు వాయిదా పడిందని ఆయన వెల్లడించారు.
విజయ్ క్రమశిక్షణ, పనిపట్ల నిబద్ధత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని వెంకట్ కె. నారాయణ చెప్పారు. భగవంత్ కేసరిలోని రెండు సన్నివేశాలు మాత్రమే స్ఫూర్తిగా తీసుకున్నామని, మిగతా కథ పూర్తిగా కొత్త ప్రపంచం, కొత్త భావోద్వేగాలతో సాగుతుందని స్పష్టం చేశారు. అమ్మాయిల సాధికారతను ప్రతిబింబించే ఈ చిత్రానికి ‘యూ/ఏ’ బదులుగా ‘ఏ’ సర్టిఫికేట్ రావడం బాధ కలిగించిందన్నారు. విజయ్ నటుడిగా చేసిన ప్రయాణానికి ఈ సినిమా ఘనమైన వీడ్కోలు, అభిమానులకు జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!