
జనరల్

నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం తరఫున రాహుల్ గాంధీతో తాను చర్చలు జరిపినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రాహుల్ గాంధీ మొదట పార్లమెంట్‌లో నీట్‌పై చర్చించాలని కోరగా, అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తాము స్పష్టంగా తెలియజేశామని పేర్కొన్నారు.

అయితే అనంతరం రాహుల్ గాంధీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై పట్టుబడటంతో పాటు మరో రెండు కొత్త డిమాండ్లు తెరపైకి తీసుకువచ్చారని జితేంద్ర సింగ్ ఆరోపించారు. ఇప్పటికే చర్చకు అంగీకరించిన తర్వాత డిమాండ్లను మారుస్తూ వెళ్లడం సరైంది కాదని ఆయన వ్యాఖ్యానిస్తూ, నీట్ అంశంపై పార్లమెంట్‌లోనే సమగ్ర చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!