
సినిమాలు

అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. యానాం–నరసాపురం మధ్య తీరం దాటిన ఈ తుఫాన్ తీవ్రత క్రమంగా తగ్గి బలహీనపడినట్లు సమాచారం. తీరం దాటే సమయంలో గంటకు 125–130 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. తుఫాన్ ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తుఫాన్ ప్రభావం నేపథ్యంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం, గుంటూరు, పల్నాడు, శ్రీకాకుళం, మన్యం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. సంబంధిత జిల్లాల ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ, అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని సూచించారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!