
జనరల్

మధ్యప్రదేశ్‌లోని అమర్‌కంఠక్‌లో ఉన్న ప్రసిద్ధ మా నర్మదా ఆలయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలోని ఏనుగు విగ్రహం కింద ఉన్న చిన్న సందులో నుంచి బయటకు వస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ నమ్మకంతో ఓ భక్తుడు ఆ సందులో నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే మధ్యలోకి వెళ్లగానే ఇరుక్కుపోయి ముందుకు, వెనక్కి కదల్లేని పరిస్థితి ఎదురైంది.
అతడు బయటకు రాలేక ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన ఇతర భక్తులు, స్థానికులు వెంటనే సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఎలా కదలాలో సూచిస్తూ అతడిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. గంటలపాటు శ్రమించిన తర్వాత ఎట్టకేలకు అతడిని సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!