23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత తుది జట్టు ఎంపికపై గంగూలీ అసంతృప్తి

Writer: Pooja 03:29 PM, 23 నవంబర్, 2026
భారత తుది జట్టు ఎంపికపై గంగూలీ అసంతృప్తి

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ బ్యాటర్లను భారత బౌలర్లు ఆలౌట్‌ చేయలేకపోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. పిచ్‌ నుంచి బౌలర్లకు ఆశించిన స్థాయిలో సహకారం లభించకపోవడమే ఫలితం తేలకపోవడానికి కారణమని టీమ్‌ఇండియా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ పేర్కొన్నాడు. అయితే, భారత తుది జట్టు ఎంపికపై మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రధాన స్పిన్నర్‌ లేకుండా టెస్టు మ్యాచ్‌లో ఎలా బరిలోకి దిగుతారని ప్రశ్నించాడు. మ్యాచ్‌ ఐదో రోజుకు చేరుకునే సరికి పిచ్‌ మరింత ఫ్లాట్‌గా మారుతుందని, అలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ జట్టుకు ఎంతో కీలకమని అభిప్రాయపడ్డాడు. వాషింగ్టన్‌ సుందర్‌ను ఆల్‌రౌండర్‌గా ఆడిస్తున్నప్పుడు, కుల్‌దీప్‌ యాదవ్‌ లేదా మానవ్‌ సుతార్‌ వంటి స్పెషలిస్ట్‌ స్పిన్నర్లను ఎందుకు ఎంపిక చేయలేదని ప్రశ్నించాడు. నాణ్యమైన స్పిన్నర్‌ లేకుండా టెస్టు మ్యాచ్‌లు గెలవడం కష్టమని గంగూలీ తన పోస్టులో పేర్కొన్నాడు.

మరోవైపు, తొలి టెస్టు డ్రాగా ముగియడంపై పలువురు మాజీ క్రికెటర్లు పిచ్‌ పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ స్పందిస్తూ.. మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడం నిరాశ కలిగించిందని, పిచ్‌ ఈ విధంగా స్పందిస్తుందని ఊహించలేదని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ స్కాట్‌ స్టైరిస్‌ కూడా గావస్కర్‌ అభిప్రాయంతో ఏకీభవించాడు. టెస్టు క్రికెట్‌కు ఇలాంటి పిచ్‌ సరైంది కాదని, బ్యాట్‌, బంతి మధ్య సమానమైన పోటీ ఉండేలా పిచ్‌ సిద్ధం చేయాలని సూచించాడు. చివరి రోజు ఉదయం కొంతవరకు బౌలర్లకు అనుకూలంగా కనిపించినా, సమయం గడిచే కొద్దీ పిచ్‌ నుంచి వారికి సహకారం తగ్గిపోయిందని వివరించాడు. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగియడంతో పిచ్‌ తయారీతో పాటు భారత జట్టు ఎంపికపై కూడా చర్చ మొదలైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌కు తగ్గిన విజయాల శాతం

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్‌కు తగ్గిన విజయాల శాతం

తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హర్షిత్ రాణా

తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హర్షిత్ రాణా

భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టెస్టు డ్రా.. చివరి వరకు పోరాడిన కివీస్

భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టెస్టు డ్రా.. చివరి వరకు పోరాడిన కివీస్

భారత్-పాక్ యువ జట్ల పోరులో ఉద్రిక్తత.. ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం

భారత్-పాక్ యువ జట్ల పోరులో ఉద్రిక్తత.. ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం

భారత్ భారీ స్కోరుకు కివీస్ బ్యాటర్ల అడ్డుకట్ట

భారత్ భారీ స్కోరుకు కివీస్ బ్యాటర్ల అడ్డుకట్ట

శాండ్ పేపర్ గేట్‌పై ఏబీడీ సంచలన వ్యాఖ్యలు

శాండ్ పేపర్ గేట్‌పై ఏబీడీ సంచలన వ్యాఖ్యలు

ట్యాగ్లు
భారత్ వర్సెస్ న్యూజిలాండ్సౌరభ్ గంగూలీశుభ్‌మన్ గిల్స్పెషలిస్ట్ స్పిన్నర్టెస్ట్ క్రికెట్పిచ్ వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బట్టలను స్విమ్మింగ్ పూల్‌లో పడేసిన ముకేష్.. ఇంట్లో పెద్ద గొడవ!
షోస్

బట్టలను స్విమ్మింగ్ పూల్‌లో పడేసిన ముకేష్.. ఇంట్లో పెద్ద గొడవ!

హ్యాండ్‌ పంపు కొడితే నీళ్లకు బదులు మద్యం రాక..
జనరల్

హ్యాండ్‌ పంపు కొడితే నీళ్లకు బదులు మద్యం రాక..

భారత తుది జట్టు ఎంపికపై గంగూలీ అసంతృప్తి
క్రీడలు

భారత తుది జట్టు ఎంపికపై గంగూలీ అసంతృప్తి

యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై నాన్ బెయిలబుల్ వారెంట్
జనరల్

యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై నాన్ బెయిలబుల్ వారెంట్

ఫుట్‌పాత్‌పై బైకర్ల ఆగడాలకు యువతుల అడ్డుకట్ట
జనరల్

ఫుట్‌పాత్‌పై బైకర్ల ఆగడాలకు యువతుల అడ్డుకట్ట

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ సాయం!
జనరల్

లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ సాయం!

వాట్సాప్ గ్రూపులపై నిఘా.. భద్రతా సంస్థల్లో తక్షణ ఆడిట్‌కు ఆదేశాలు
జనరల్

వాట్సాప్ గ్రూపులపై నిఘా.. భద్రతా సంస్థల్లో తక్షణ ఆడిట్‌కు ఆదేశాలు

ప్రధాని మోదీతో నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా భేటీ
జనరల్

ప్రధాని మోదీతో నేపాల్‌ ప్రధాని బాలేంద్ర షా భేటీ

నేపాల్ అభివృద్ధికి భారత్ అండ.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
జనరల్

నేపాల్ అభివృద్ధికి భారత్ అండ.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు!
రాజకీయాలు

మూడో విడత పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు!

పశ్చిమ బెంగాల్ పేరును పశ్చిమ బంగాగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రయత్నం
జనరల్

పశ్చిమ బెంగాల్ పేరును పశ్చిమ బంగాగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రయత్నం

ఒక్క సీన్‌ కోసం సూర్య 20 టేక్స్‌
సినిమాలు

ఒక్క సీన్‌ కోసం సూర్య 20 టేక్స్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!