
రాజకీయాలు

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు బోయపాటి శ్రీను కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారి ఆశీస్సులు పొందారు.
దర్శనం అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం వేద పండితులు బోయపాటి శ్రీనుకు ఆశీర్వచనం అందించారు. పండితుల ఆశీస్సులు స్వీకరించిన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం నుంచి బయటకు వచ్చారు. ప్రముఖ సినీ దర్శకుడు ఇంద్రకీలాద్రికి రావడంతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!