28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..

Writer: Chandrika 04:14 PM, 28 నవంబర్, 2026
డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని విపక్ష ఇండియా కూటమి నిర్ణయించినట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ స్థానాల పెంపు పేరుతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ బిల్లు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా మారుతుందని, ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ చేతుల్లోనే అధికారం శాశ్వతంగా ఉండేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఖర్గే ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడటంతో పాటు అణగారిన వర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బిల్లును వ్యతిరేకించాలని అన్ని విపక్ష పార్టీలు ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ, రాజ్యసభ స్వతంత్ర సభ్యుడు కపిల్ సిబల్, ఆర్జేడీ, సీపీఐ నేతలతో పాటు పలువురు విపక్ష నాయకులు పాల్గొన్నారు. గతంలోనూ ఈ బిల్లును తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని, విపక్షాల వ్యతిరేకతతో ఆ ప్రయత్నం విఫలమైందని ఖర్గే గుర్తుచేశారు. ఇప్పుడు మరో రూపంలో కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చారని విమర్శించారు. కాగా, ఈ సమావేశానికి డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బిజూ జనతాదళ్ (బీజేడీ) నేతలను ఆహ్వానించినప్పటికీ వారు హాజరుకాకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం, విపక్ష ఇండియా కూటమి మధ్య రాజకీయ పోరు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు..

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు..

మహిళా రిజర్వేషన్లకు అడ్డంకులన్నీ తొలగిస్తాం.. ప్రతిపక్షాలు అడ్డుకోలేవు: ప్రధాని మోదీ

మహిళా రిజర్వేషన్లకు అడ్డంకులన్నీ తొలగిస్తాం.. ప్రతిపక్షాలు అడ్డుకోలేవు: ప్రధాని మోదీ

డీలిమిటేషన్ బిల్లుతో ఇండియా కూటమిలో విభేదాలు

డీలిమిటేషన్ బిల్లుతో ఇండియా కూటమిలో విభేదాలు

డీలిమిటేషన్‌పై ఇండియా కూటమి మూడు కీలక డిమాండ్లు

డీలిమిటేషన్‌పై ఇండియా కూటమి మూడు కీలక డిమాండ్లు

డీలిమిటేషన్‌తో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది - రాంచందర్ రావు

డీలిమిటేషన్‌తో అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది - రాంచందర్ రావు

ట్యాగ్లు
మల్లికార్జున ఖర్గేఇండియా కూటమిడీలిమిటేషన్ బిల్లుకాంగ్రెస్రాహుల్ గాంధీనరేంద్ర మోదీభారత రాజకీయాలులోక్‌సభ స్థానాలువిపక్షాల సమావేశంఎస్సీ ఎస్టీ ప్రయోజనాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వక్ఫ్ బోర్డు సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అభ్యంతరం..
రాజకీయాలు

వక్ఫ్ బోర్డు సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అభ్యంతరం..

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు..
జనరల్

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు..

నిజామాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన..
జనరల్

నిజామాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన..

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో సైబర్ మోసం..
జనరల్

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో సైబర్ మోసం..

స్విట్జర్లాండ్‌లో మార్మోగిన అన్నమయ్య సంకీర్తన..
జనరల్

స్విట్జర్లాండ్‌లో మార్మోగిన అన్నమయ్య సంకీర్తన..

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు..
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు..

ఇక స్మార్ట్ టీవీల్లోనూ ఇన్‌స్టాగ్రామ్..
టెక్నాలజీ

ఇక స్మార్ట్ టీవీల్లోనూ ఇన్‌స్టాగ్రామ్..

మహిళా రిజర్వేషన్లకు అడ్డంకులన్నీ తొలగిస్తాం.. ప్రతిపక్షాలు అడ్డుకోలేవు: ప్రధాని మోదీ
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్లకు అడ్డంకులన్నీ తొలగిస్తాం.. ప్రతిపక్షాలు అడ్డుకోలేవు: ప్రధాని మోదీ

హరియాణా దాబా కాల్పుల కేసులో సంచలనం..
జనరల్

హరియాణా దాబా కాల్పుల కేసులో సంచలనం..

డీలిమిటేషన్ బిల్లుతో ఇండియా కూటమిలో విభేదాలు
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుతో ఇండియా కూటమిలో విభేదాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!