
జనరల్

దుబాయ్ డీరా గోల్డ్ సౌక్‌లో ‘దుబాయ్ సెలబ్రేషన్ చైన్’ పేరుతో అద్భుతమైన బంగారు నిర్మాణం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు అయింది. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 20వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ఈ చైన్ 5.52 కిలోమీటర్ల పొడవు, సుమారు 256 కిలోల బరువుతో ప్రపంచ రికార్డుగా నిలిచింది.
100 మంది నిపుణ కళాకారులు 45 రోజులపాటు రోజుకు 10 గంటలు పని చేసి 22 క్యారట్ బంగారంతో దీన్ని తయారు చేశారు. తర్వాత ఈ చైన్‌ను చిన్న భాగాలుగా విభజించి, ధృవీకరించిన లిమిటెడ్ ఎడిషన్ జువెలరీగా విక్రయించారు. దుబాయ్ ప్రముఖ జువెలరీ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!