
జనరల్

హైదరాబాద్‌లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహిస్తోంది. ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ప్రాంగణాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఝార్ఖండ్‌కు సంబంధించిన కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. కోల్‌కతా ఈడీ యూనిట్ ఆధ్వర్యంలో ఈ చర్యలు కొనసాగుతున్నాయి.
కోల్‌కతా నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌లోని సంబంధిత కార్యాలయాలు, ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఏఎంఆర్ సంస్థను ప్రమోట్ చేస్తున్న పారిశ్రామికవేత్త ఏ. మహేశ్‌రెడ్డి, ఆయన కుటుంబానికి సంబంధించిన వ్యాపార సంస్థలపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు సమాచారం. ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్‌కు సంబంధించిన అంశాలపై ఈడీ వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!