
జనరల్

ఇటీవల ఖాళీ అయిన రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 11 రాజ్యసభ స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌లో ఖాళీ అయిన ఒక అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న నోటిఫికేషన్ విడుదల కానుంది.
నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 6 చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 7న నామినేషన్ల పరిశీలన జరగనుండగా, అభ్యర్థిత్వాల ఉపసంహరణకు అక్టోబర్ 9 వరకు గడువు ఉంటుంది. అక్టోబర్ 16న పోలింగ్ నిర్వహించి, అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!